బిగ్ బాస్ ఇంట్లో మూడో వారం అభయ్ కాస్త హద్దులు దాటాడు. చీఫ్ అయి ఉండి కూడా కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తించాడు. అభయ్ తన నోటిని అదుపులో పెట్టుకోలేకపోయాడు. అభయ్ తన నోటి దురుసుతో క్లాన్ మొత్తాన్ని ముంచేశాడు. బిగ్ బాస్ ఇంట్లో ఉండి కూడా.. బిగ్ బాస్‌ను బండ బూతులు తిడితే.. ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అలా చివరకు అభయ్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బిగ్ బాస్‌ను బూతులు తిట్టి ఆడియెన్స్‌కి కూడా దూరం అయ్యాడు.
అభయ్ ఈ వారం ఆటలు ఆడలేదు. మాటలతోనే నడిపించాడు. క్లాన్ చీఫ్ అయి ఉండి.. సభ్యుల్ని ఓ దారిలో నడిపించాల్సింది పోయి.. పక్కదోవ పట్టించాడు. బిగ్ బాస్‌ను తిట్టడమే పని పెట్టుకున్నాడు. ఆటను గాలికి వదిలేశాడు. టీం అంతా ప్రాణాలు అడ్డు పెట్టి ఆడితే.. అభయ్ మాత్రం కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్నాడు. అదే కొంప ముంచింది.
అభయ్‌ని బిగ్ బాస్ టీం ఈ వారం ఎలాగూ బయటకు పంపేది. ఇలా ఆటలు ఆడకుండా.. ఆడియెన్స్ దృష్టిలోనూ చులకన అయిపోయాడు. ఏరి కోరి నామినేషన్లోకి వచ్చిన అభయ్ ఎలిమినేషన్లోకి వచ్చాడు. ఇప్పుడు అభయ్ బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్‌ను అలా తిట్టి ఇలా బయటకు వచ్చేశాడు. ఇది అందరికీ ఓ గుణపాఠం అయ్యేలా ఉంది. ఇకపై అయినా అందరూ బిగ్ బాస్‌ను గౌరవిస్తారని అనిపిస్తుంది.