Site icon A2Z ADDA

Bappi Lahiri : బప్పీలహరి కన్నుమూత..

Bappi Lahiri Death బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి కన్నుమూశారు. నేటి (ఫిబ్రవరి 16) ఉదయం ఆయన అనారోగ్య కారణాలతో తుది శ్వాసవిడిచారు. బప్పీలహరితో తెలుగు చిత్రపరిశ్రమకు ఎంతో అనుబంధం ఉంది. బప్పీలహరి చిరంజీవి కాంబినేషన్‌కు సంగీత ప్రియులు ఫిదా అవుతుంటారు. వీరి కాంబినేషన్‌లో గ్యాంగ్ లీడర్ వంటి మాస్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వచ్చింది.

తెలుగుకి పరిచయం చేసింది మాత్రం సూపర్ స్టార్ కృష్ణ. సింహాసనం సినిమాతో టాలీవుడ్‌కు బప్పీలహరి వచ్చారు. ఆకాశంలో ఒకతార అనే పాటతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇక చిరంజీవి స్టేట్ రౌడీ సినిమా మాత్రం చిరు అభిమానులను తెగ ఆకట్టుకుంది. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు వంటి సినిమాలు మ్యూజికల్ హిట్లుగా నిలిచాయి.

Exit mobile version