Site icon A2Z ADDA

మాటల మాంత్రికుడిని మించేశాడు!.. ప్రభాస్‌పై బండ్లన్న వరుస ట్వీట్లు

బండ్ల గణేష్ మాటలు, ప్రాసలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఒక్క సారి స్టేజ్ ఎక్కి మైక్ పడితే.. ముందు కూర్చున్న అభిమానులు విజిల్స్ వేస్తూనే ఉండాలి. ఇక సీట్లు చిరిగేలా పిచ్చెక్కిపోవాల్సిందే. అయితే బండ్ల గణేష్ తాజాగా ప్రభాస్ గురించి వరుసగా ట్వీట్లు పెడుతూనే ఉన్నాడు. ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు అవుతున్న సందర్భంగా డార్లింగ్ ఫ్యాన్స్ నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఈక్రమంలో బండ్లన్న ప్రభాస్ మీద తన అభిమానాన్ని చాటాడు.

ప్రభాస్ మీద వేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. డార్లింగ్ మీద వేసిన ట్వీట్లతో ప్రభాస్ అభిమానులు సంబరపడిపోతోన్నారు. ధర్మం మార్కెట్లో దొరకదు బ్రదర్ అది బ్లడ్‌లో ఉండాలి.. అది ఇక్కడ నిండుగా ఉంది.. అమెరికా వెళ్లిన నాడు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ఇండియా వచ్చిన నాడు ప్రభాస్ సినిమా చూడకుండా ఉండరు .. తనను ఇష్టపడే వాళ్లకు నేనున్నానన్న భరోసా ఇచ్చే మహారాజులా ఉన్నాడు.. ఉదాహరణ రొమాంటిక్ సినిమా ఆయన చూపించిన ప్రేమ ఆకాష్ పూరిపై..

పట్టాభిషేకానికి వెళ్తున్న అశోక చక్రవర్తిలా ఉన్నాడు.. మహాభారత యుద్దంలో అర్జునుడిలా ఉన్నాడు.. ఇలా వరుసగా బండ్లన్న ట్వీట్లు వేస్తూనే వచ్చాడు. గుడిలో ఉంటూ, ప్రయాణం చేస్తూ ఇలా ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తుండటంతో అందరూ షాక్ అవుతున్నారు. మొత్తానికి బండ్లన్న ట్విట్టర్‌కు నిద్ర పట్టనివ్వడం లేదు.

Exit mobile version