Site icon A2Z ADDA

కచ్చితంగా సీఎం అవుతారు.. పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్

బండ్ల గణేష్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం గానీ పరిచయం చేయాల్సిన పని గానీ ఉండదు. పరమేశ్వరుడి గురించి తెలిసిన వారికి భక్త కన్నప్ప గురించి తెలిసే ఉంటుంది. అలానే పవన్ కళ్యాణ్ ఎంత మందికి తెలుసో.. బండ్ల గణేష్ అంత మందికి తెలుస్తంది. అంతలా తన వీరాభిమానాన్ని, భక్తిని చాటుతుంటాడు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా తన భక్తిని చూపిస్తుంటాడు.

ఈశ్వర పవనేశ్వరా పవరేశ్వరా అనే పదాలు ఇంకా మార్మోగిపోతూనే ఉన్నాయి. వకీల్ సాబ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఇంకా అభిమానుల చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. తాజాగా బండ్ల గణేష్ కొన్ని సంచలన కామెంట్లు చేశాడు. పవన్ కళ్యాణ్ మీదున్న భక్తిని చాటుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ను సినిమా చేయమని అడగలేదని క్లారిటీ ఇచ్చాడు.

ఓ మీడియాతో మాట్లాడుతూ బండ్ల గణేష్ అందరినీ ఆశ్చర్యపరిచే విషయాలు చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ ఏప్పటికైనా సరే ఏపీకి సీఎం అవుతాడు.. రాసి పెట్టుకోండి అని ధీమాను వ్యక్తం చేశాడు. అంత సీరియస్‌గా ఉన్నాడా? అని ఇంటర్వ్యూ చేసే అవతలి వ్యక్తి ప్రశ్నిస్తే.. సీరియస్‌గా ఉన్నారా?లేదా? అని రోజూ మీ ఇంటికొచ్చి బట్టలిప్పి చూపించాలా? అంటూ తన స్టైల్లో సెటైర్లు వేశాడు.

మొత్తానికి బండ్లన్న మాత్రం మరోసారి తన వీరాభిమానాన్ని చూపించాడు. బండ్లన్న మాటలు ఇప్పుడు నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తున్నాయి. బండ్ల మాటలను పవన్ కళ్యాణ్ అభిమానులు షేర్లు చేస్తున్నారు, కామెంట్లతో హంగామా చేస్తున్నారు.

Exit mobile version