అమీర్‌పేటలో యోదా డయోగ్నస్టిక్స్ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్‌రావు, తలసాని, చిరంజీవి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
అయితే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవంలో చిరంజీవి ప్రసంగిస్తూ మా మెంబర్స్ కోసం, 24 క్రాఫ్ట్స్‌లో పని చేస్తున్న వారందరి తరుపున ఓ విజ్ఞప్తి చేశారు. మా వాళ్లందరికీ ఏదైనా సాయం చేయగలరా అని ఎంతో విధేయతతో, విన్రమతతో అడిగేశాడు చిరంజీవి.
ఆ వెంటనే యోదా డయగ్నోస్టిక్ సెంటర్ అధినేత హామీ ఇచ్చాడు. మా మెంబర్స్ అందరికీ వైద్యంలో యాభై శాతం డిస్కౌంట్ ఇస్తామని అన్నాడు. 24 క్రాఫ్ట్స్ వారందరికి కూడా అని పక్కనే ఉండి చిరంజీవి మరీ చెప్పాడు. సినిమాకు సంబంధించిన ప్రతీ ఒక్కరికీ యాభై శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించాడు. నేను మిమ్మల్ని బలవంతం చేయడం లేదు.. మీకు ఇష్టమైతేనే చేయండని ఎంతో విన్రమంగా అడిగేశాడు చిరంజీవి. అదేం లేదంటూ అంటూ అందరి ముందు హామీ ఇచ్చేశాడు.
@KChiruTweets sir Meeru super ………No words about you sir
pic.twitter.com/VNF5qa07XX — BANDLA GANESH. (@ganeshbandla) November 18, 2021
అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో మీద బండ్ల గణేష్ స్పందించారు. మీరు సూపర్ సార్.. మీ గురించి మాటల్లో చెప్పలేకపోతోన్నాను.. మాటలు సరిపోవడం లేదు అని తన అభిమానాన్ని చాటుకున్నాడు బండ్ల గణేష్.