Site icon A2Z ADDA

డేగల బాబ్జీ ట్రైలర్.. ఏడిపించిన బండ్ల గణేష్

బండ్ల గణేష్ నటుడిగా, నిర్మాతగా తన సత్తా చాటుకున్నాడు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న బండ్ల గణేష్ బండ్ల గణేష్ ఇప్పుడు కొత్తగా ట్రై చేశాడు. తమిళంలో పార్తిబన్ హీరోగా వచ్చిన ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ చిత్రాన్ని తెలుగులో ‘డేగల బాబ్జీ’గా రీమేక్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు వచ్చింది.

#DegalaBabji Official Movie Trailer | Bandla Ganesh | Venkat Chandra | Lynus | Swathi Chandra

 

మర్డర్ కేస్ తాలూక సస్పెక్ట్ అంటూ డేగల బాబ్జీగా బండ్ల గణేష్ ఎంట్రీ అదిరిపోయింది.. ఈశ్వరా పరమేశ్వరా నా పేరు డేగల బాబ్జీ.. ఏట్కూరు..గుంటూరు జిల్లా సంతూరు.. సంతూరు కాదు సర్.. సొంతూరు అని బండ్ల గణేష్ అదరగొట్టేశాడు.

సినిమా మొత్తంలో ఒక్క బండ్ల గణేష్ మాత్రమే కనిపించబోతోన్నట్టు ఉంది. ఒక్కడే అన్ని రకాల ఎమోషన్స్ పలికించాడు. కొడుకు పుట్టినప్పుడు వాడు ఏడవ లేదు.. కానీ పుట్టాక ప్రతీరోజూ నేను ఏడ్చాను.. మా అమ్మ పొట్టిగానే ఉంటుంది.. కానీ అందంగానే ఉంటుంది… అయినా అమ్మ ఎక్కడైనా అందంగా ఉండాలనే రూల్ ఉందా? అంటూ బండ్ల గణేష్ అందరినీ ఏడిపించాడు.

పోలీస్ స్టేషన్‌లో విచారణ ఎదుర్కొంటున్న బండ్ల గణేష్ తన గతాన్ని చెప్పడం, తానే అన్నీ ఊహించుకోవడం, భయపడటం, ఏడవడం ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను బండ్ల గణేష్ పలికించాడు. మొత్తానికి బండ్లన్న అందరినీ మెప్పించేసేలా ఉన్నాడు. సింగిల్ లొకేషన్‌లో సింగిల్ యాక్టర్‌తో షూట్ చేసిన చిత్రంగా డేగల బాబ్జీ నిలిచిపోతోంది.

యశ్రిషి బ్యానర్ మీద స్వాతి చంద్ర నిర్మించిన ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకుడిగా పని చేశారు. ఈచిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Exit mobile version