Site icon A2Z ADDA

Zee5లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న అరవింద్ కృష్ణ ‘SIT ’

యంగ్ హీరో అరవింద్ కృష్ణ ప్రస్తుతం SIT సినిమాతో టాప్‌లో ట్రెండ్ అవుతున్నారు. అరవింద్ కృష్ణ హీరోగా నటాషా దోషి హీరోయిన్‌గా విజయ భాస్కర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం S.I.T (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం). ఈ చిత్రాన్ని నాగి రెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ మే 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో బాగానే దూసుకుపోతోంది.

అరవింద్ కృష్ణ అటు సినిమాలు, ఇటు స్పోర్ట్స్ అంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అరవింద్ కృష్ణ బాస్కెట్ బాల్ ఆటతో మెప్పిస్తున్నాడు. ఇక ఇప్పుడు SIT మూవీతో ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా అరవింద్ కృష్ణ అద్భుతమైన నటనను కనబర్చాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేశాడు.

అరవింద్ కృష్ణ SIT ప్రస్తుతం జీ5లో ట్రెండ్ అవుతోంది. ఇక త్వరలోనే ‘ఎ మాస్టర్ పీస్’ అనే సినిమాతో రాబోతున్నాడు. సూపర్ హీరోగా అరవింద్ కృష్ణ తెరపై అడ్వెంచర్లు చేయబోతున్నాడు. ఇవే కాకుండా పలు ప్రాజెక్ట్‌లు కూడా సెట్స్ మీదకు రాబోతోన్నాయి.

Exit mobile version