Site icon A2Z ADDA

హృదయాన్ని హత్తుకుంటోన్న ‘మాతృ’ మూవీ ‘అపరంజి బొమ్మ.. మా అమ్మ’ పాట

మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన చిత్రాలన్నీ ఇంత వరకు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మాతృ దేవో భవ నుంచి బిచ్చగాడు వరకు ఎన్నెన్నో కల్ట్ క్లాసిక్‌గా నిలిచాయి. ఇప్పుడు ఇదే మదర్ సెంటిమెంట్‌తో ఓ చిత్రం రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద శ్రీ పద్మ సమర్పణలో బి. శివ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మాతృ’. శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జాన్ జక్కీ దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ పెంచేశారు. మాతృ టైటిల్‌కు తగ్గట్టుగా సాగే ఓ మదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అపరంజి బొమ్మ.. మా అమ్మ అంటూ సాగే ఈ పాటను దినేశ్ రుద్ర ఆలపించగా.. బి. శివ ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. శేఖర్ చంద్ర బాణీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఈ పాట అందరి హృదయాల్ని కరిగించేలా ఉంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

Aparanji Bomma Maa Amma Lyrical Song | Maathru | Sriram | John Jakki | Shekar Chandra

ఇక ఈ సినిమా నిర్మాతే ఇంతటి గొప్ప పాటను రాయడం విశేషం. ఈ చిత్రానికి రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరామెన్‌గా, సత్యనారాయణ బల్లా ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

Exit mobile version