Site icon A2Z ADDA

Anasuya-KTR: కేటీఆర్‌ను వేడుకున్న అనసూయ.. అసలు కథ ఏంటంటే?

Anasuya-KTR అనసూయ ఎప్పుడూ కూడా ఏదో ప్రశ్నను లేవనెత్తుతూనే ఉంటుంది. ఏదో ఒక సామాజిక సమస్య మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. అది ఏ సమస్య అయినా గానీ కేటీఆర్‌ను అడ్రస్ చేసి వేస్తుంటుంది. మొదటి సారిగా లాక్డౌన్ విధించినప్పుడు కూడా అంతే. కేటీఆర్ మీద ప్రశ్నల వర్షం కురిపించింది. అలా సడెన్‌గా ఇంట్లో కూర్చోమంటే ఎలా మా ఇళ్లు ఎలా గడుస్తుంది.. మా ఈఎంఐలు ఎలా కట్టాలి? అంటూ ఇలా రకరకాలుగా ప్రశ్నలు వేసింది. ఆ సమయంలో అనసూయ మీద ట్రోలింగ్ జరిగినా కూడా అవే అసలు సమస్యలు మారాయి. అందుకే బ్యాంకులను ప్రభుత్వం కోరింది. ఈఎంఐల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సూచించింది.

అలా కొన్ని బ్యాంకుల మారటోరియం పద్దతులత్లో ఈఎంఐలను వసూళ్లు చేసింది. అయితే తాజాగా అనసూయ మరో సమస్యను లేవనెత్తేసింది. అసలే ఇప్పుడు కరోనా మహమ్మారి ఇంకా పోలేదు. కానీ జనాల్లో భయం మాత్రం పోయింది. ఇప్పుడు ఎక్కడా ఎవ్వరూ కూడా మాస్కులు ధరించడం లేదు. స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. ఇష్టం ఉంటే పంపించండి.. లేదంటే లేదు.. బలవంతం పెట్టొద్దు అని స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ కొన్ని చోట్ల అవి అమలు కావడం లేదు.

అయితే తమ పిల్లలను పంపించాల్సింది.. ఏం జరిగినా తమ బాధ్యత కాదంటూ సంతకం పెట్టించుకుని మరీ పిల్లలను పంపమని స్కూల్ వాళ్లు అడుగుతున్నారు ఇదెక్కడి న్యాయం అంటూ అనసూయ ఆవేదన చెందింది. చిన్న పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ ఇవ్వనేలేదు.. అసలు లాక్డౌన్ ఎందుకు పెట్టారు.ఎందుకు తీశారు.. మీరు ఈ సమస్యను కచ్చితంగా పట్టించుకోండి అంటూ కేటీఆర్‌ను అనసూయ వేడుకుంది. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version