Site icon A2Z ADDA

Pushpaka Vimanam Review: పుష్పక విమానం రివ్యూ.. ఇందులో ప్రయాణం కష్టమే

Pushpaka Vimanam Review మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో అందరినీ మెప్పించిన ఆనంద్ దేవరకొండ.. మరో కొత్త కాన్సెప్ట్‌తో వచ్చాడు. భార్య లేచిపోయిందనే కాన్సెప్ట్‌ను చాలా మంది హీరోలు తిరస్కరించడంతో తానే చేశాను అని ఆనంద్ నిర్మొహమాటంగా చెప్పేశాడు. అయితే కథలో బలం ఉంటే.. హీరోలతో పని లేకుండా సినిమా నడుస్తుంది. మరి ఈ పుష్పక విమానం సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

పెళ్లి మీద ఎన్నో కలలు కంటూ ఉంటాడు లెక్కల మాస్టారైన చిట్టిలంక సుందర్ (ఆనంద్ దేవరకొండ). మీనాక్షి (గీత్ సైనీ)ని పెళ్లి చేసుకుని సిటీకి వచ్చి కాపురం పెడతాడు. కానీ భార్య లేచిపోతోంది. ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేడు. దీంతో ష్టార్ట్ ఫిల్స్మ్‌లో నటించే రేఖ (శాన్వీ మేఘన)ను తన భార్యగా నటించమని అడుగుతాడు. మరో వైపు లేచిపోయిన భార్య కోసం వెదుకులాట కొనసాగిస్తాడు. అలాంటి సుందర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అసలు ఆయన భార్య ఎందుకు లేచిపోయింది? ఆమె కథ ఎలా మలుపులు తిరిగింది? ఈ కథలో ఎస్సై రంగ (సునీల్) పాత్ర ఏంటి? చివరకు సుందరం పరిస్థితి ఏమైంది? అనేదే పుష్పక విమానం.

నటీనటులు

సుందరం పాత్రలో ఆనంద్ దేవరకొండ అద్బుతంగా నటించాడు. అతడ్ని తెరపై చూస్తున్నంత సేపు మనకు జాలి కలుగుతుంది. అయ్యో ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటా? అని అంతా అనుకుంటూ ఉంటారు. మొత్తానికి సుందరం పాత్రలో ఆనంద్ జీవించేశాడు. ఇక మీనాక్షిగా తెరకు కొత్తగా పరిచయమైంది గీత్ సైనీ. ఉన్నంతలో ఆమె పర్వాలేదనిపించింది. శాన్వీ అల్లరి, మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక సునీల్ కాస్త యాస, భాష, కట్టు మార్చేశాడు. పర్వాలేదనిపించాడు. నరేష్ ఇలా మిగిలిన పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు చక్కగా నటించారు.

విశ్లేషణ

పుష్పక విమానం సినిమాలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అదే మిస్సయింది. పెళ్లి అంటే ఏంటి చెప్పాలనున్నాడా? పెళ్లి చేసుకుంటే జీవితం ఇలా అవుతుందని చెప్పదలుచుకున్నాడా? అన్న విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. మొదటి భాగమంతా సుందర్ తన భార్యను వెదకడం, లేచిపోయిందని చెప్పుకోలేక కవర్ చేసుకునే సీన్లతో లాగించేశాడు.

ద్వితీయార్థంలో లేచిపోయిన భార్య మరణించిందని, దానికి కారణం సుందర్ అంటూ ఎస్సై రంగ రంగంలోకి దిగుతాడు. అయితే అక్కడైనా కథనం సరిగ్గా ఉంటుందా? అంటే అదీ లేదు. పుష్పక విమానం అంటూ గాల్లో అటూ ఇటూ ముందుకు వెనక్కి సాగినట్టు కథ కూడా అలానే వెళ్తూ ఉంటుంది. చివరకు వర్ష బొల్లమ్మా అతిథిగా వచ్చి పెట్టే క్వశ్చన్ మార్క్.. థియేటర్లో ప్రేక్షకులు కూడా పెడతారు. అలా మొత్తానికి డైరెక్టర్‌కే అంతు పట్టని కథను ప్రేక్షకులకు ఎక్కించడం సాధ్యమవుతుందా.

అయితే ఈ చిత్రం మరీ అంత గొప్పగా లేకపోయినా ఒక్కసారి మాత్రం చూడొచ్చు.అలా వినోదాత్మకంగా నవ్వుతూ ఎంజాయ్ చేసేలానే ఉంది. ఎటొచ్చీ ద్వితీయార్థమే గాడితప్పింది. చివరకు ఇచ్చిన కంక్లూజన్ ఎవ్వరీకి అర్థం కాదు. సాంకేతికంగా సినిమా బాగానే ఉంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. సొంత ప్రొడక్షన్ కాబట్టి కాస్త ఆచితూచి ఖర్చు పెట్టినట్టు కనిపిస్తోంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా సినిమాకు తగ్గట్గుగానే ఉన్నాయి.

Exit mobile version