Site icon A2Z ADDA

Pushpa : బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం.. థియేటర్లపైకి రాళ్ల దాడి

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసలే మంచి ఊపు మీదున్నారు. పుష్ప సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి సినిమా విడుదల కాబోతోందని అభిమానులు ఆశగా ఉన్నారు. ఇక బెనిఫిట్ షోలంటూ ఊరించారు. చివరి నిమిషంలో క్యాన్సిల్ చేస్తే అభిమానులు ఊరుకుంటారా? తాట తీస్తారు. తాజాగా ఇదే ఘటన జరిగింది.

ఆదోనిలో బెనిఫిట్ షోలు క్యాన్సిల్ అయ్యాయట. కేవలం ఆదోనిలోనే కాదు.. ఆంధ్రలోని దాదాపు అన్ని ఏరియాల్లో బెనిఫిట్ షోలు రద్దయ్యాయని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఆదోనిలోని బన్నీ అభిమానులు ఆగ్రహావేశాలను బయటపెట్టేశారు. ఇక థియేటర్ల మీదకు రాళ్లు రువ్వారు. దాదాపు అన్ని చోట్ల ఇలాంటి ఓ పరిస్థితే నెలకొందని తెలుస్తోంది.

సినిమా చూడాలని ఎంతో ఉత్సాహంతో వచ్చిన ఫ్యాన్స్ అలా నిరాశతో వెనుదిరిగి పోయారట. దీంతో కొందరు మాత్రం తిరగబడ్డారని తెలుస్తోంది. అందులో భాగంగానే కొందరు అభిమానులు థియేటర్ మీద రాళ్లతో దాడి చేసిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు మంచి కాక మీదున్నారు.

ఇక మరో వైపు పుష్ప మీద డివైడ్ టాక్ వస్తోంది. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ అదరగొట్టేశాడు.. కానీ రష్మిక మాత్రం తేలిపోయిందని అంటున్నారు. ఇక దేవీ శ్రీ ప్రసాద్ మాత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కొంపముంచేశాడని కామెంట్లు పెడుతున్నారు. సుకుమార్ రాసిన క్లైమాక్స్, నిడివి సినిమాకు నెగెటివ్ అవుతున్నాయని అంటున్నారు. పూర్తి రివ్యూ వస్తే గానీ ట్విట్టర్ టాక్ ఆగదు.

Exit mobile version