Site icon A2Z ADDA

Pragathi : జిమ్‌లో రెచ్చిపోయిన ప్రగతి.. బొద్దు అందాలతో ఊపేసిన నటి

Pragathi Mahavadi సీనియర్ నటి ప్రగతి సోషల్ మీడియాలో ఊపే అందాల జోరుకు అందరూ ఫిదా అవుతుంటారు. గత ఏడాది లాక్డౌన్ నుంచి నెట్టింట్లో ప్రగతి జోరు మారిపోయింది. జిమ్‌లో అయినా ఇంట్లో అయినా, బయట వీధుల్లో అయినా ప్రగతి మాత్రం ఓ రేంజ్‌లో దుమ్ములేపుతోంది. మొత్తానికి ప్రగతి ఇమేజ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తెరపై చూసే ప్రగతికి.. ఇప్పుడు కనిపించే ప్రగతికి ఎంతో తేడా ఉంటుంది.

ఆమెకు వచ్చే పాత్రలు కూడా మారిపోయాయి. మోడ్రన్ దుస్తులు వేసుకుని ప్రగతి చేస్తోన్న హల్చల్‌కు అంతా ఫిదా అవుతుంటారు. ఇక జిమ్ ఏరియాలో ఆమె వేసుకునే డ్రెస్సులు, చేసే ఎక్సర్‌సైజ్‌లు మామూలుగా ఉండవు. నాలుగు పదుల వయసులోనూ ప్రగతి ఇంత జోరుగా హుషారుగా ఉంటూ కష్టతరమైన వ్యాయామాలు కూడా చేస్తుంటుంది.

ఇక ప్రగతికి కారు, జీపు, బైక్ డ్రైవింగ్ అంటే మహా ఇష్టమన్న సంగతి తెలిసిందే. అందుకే టైం దొరికినప్పుడల్లా సవారి చేస్తుంటుంది. మొన్నీ మధ్యే బైక్ మీద తన అపార్ట్మెంట్ ఏరియాలో ప్రగతి చక్కర్లు కొట్టేసింది. ఆ వీడియోలు నెట్టింట్లో ఓ ఊపు ఊపేశాయి. ఇక ఈ మధ్య డ్యాన్స్ వీడియోలతో ప్రగతి రచ్చ చేయడం లేదేంటి? అని అనుకునే లోపే.. ప్రగతి తాజాగా అందరినీ ఆశ్చర్యపర్చింది.

తాజాగా జిమ్‌లో వర్కవుట్ సెషన్ అయిపోయినట్టుంది. ఇక డ్యాన్స్ సెషన్ మొదలపెట్టింది. తన భారీ అందాలను ఊపు ఊపుతూ నాగిని పాటకు డ్యాన్స్ చేసేసింది. మొత్తానికి ప్రగతి ఊపుడుకు నెట్టిళ్లు మొత్తం షేక్ అవుతుంది. నేను చేసే ప్రతీ దాంట్లో ఆనందాన్ని వెతుక్కుంటాను.. అదే నా చాయిస్ అంటూ ఊపు ఊపేసింది ప్రగతి.

Exit mobile version