భారత సినీ పరిశ్రమలో అగ్రతారగా వెలిగిన బి. సరోజా దేవి (87) కన్నుమూశారు. సోమవారం (జూలై 14) బెంగళూరులోని తన నివాసంలో సరోజా దేవి తుది శ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సరోజా దేవీ యశ్వంతపుర మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేటి ఉదయం మరణించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, దిలీప్ కుమార్ వంటి దిగ్గజ నటుల సరసన నటించి మెప్పించారు. భూకైలాస్ (1958) సీతారామ కల్యాణం (1961), జగదేక వీరుని కథ (1961), శ్రీకృష్ణార్జున యుద్దం (1963), దాన వీర శూర కర్ణ (1978) లాంటి ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు.
నాటి తార సరోజా దేవి కన్నుమూత
