Site icon A2Z ADDA

‘హలో మీరా’ నుంచి ‘నా కనులలో నా కలలో’ అంటూ సాగే పాట విడుదల

ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆదరణ లభిస్తోంది. కమర్షియల్ సినిమాలతో పాటుగా కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు తెరపై ఎక్కువగా ప్రయోగాత్మక కథలు వస్తున్నాయి. ఆసక్తికర కథ, కథనంతో ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో మేకర్లు సక్సెస్ అవుతున్నారు. అదే బాటలో తాజాగా ‘హలో మీరా’ అంటూ ఓ వైవిధ్యభరితమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు. ప్రముఖ దర్శకులు శ్రీ బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి ఈ ‘హలో మీరా’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు కాకర్ల శ్రీనివాసు.

సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించడం కత్తి మీద సాము. అలాంటి సాహసాన్ని హలో మీరా టీం చేయబోతోంది. ఇప్పటి వరకు చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలు సినిమా మీద అంచనాలు పెంచాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమా మీద ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. సింగిల్ కారెక్టర్‌తో సినిమాను ఎలా నడిపించారు? అనే ఇంట్రెస్ట్‌ను ప్రేక్షకులకు కలిగిచారు. తాజాగా ఈ మూవీ నుంచి నా కనులలో నా కలలలో అంటూ సాగే ఎమోషనల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.

శ్రీ సాయి కిరణ్ సాహిత్యం, సమీర భరద్వాజ్ గాత్రం, ఎస్ చిన్నా బాణీ ఈ పాటను ఎంతో వినసొంపుగా మార్చేశాయి. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు. సూరి సాధనాల అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు.

డా: లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా.. ఎస్ చిన్న సంగీతం అందించారు. తిరుమల ఎం తిరుపతి పొడక్షన్ డిజైనర్ గా, కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై] ప్రొడక్షన్ మేనేజర్స్ గా పని చేశారు. హిరణ్మయి కల్యాణ్ మాటలు రాశారు. రాంబాబు మేడికొండ ఎడిటర్ గా వర్క్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్లు ప్రకటించనున్నారు.

Naa Kanulalo Naa Kalalalo Full Video|Hello Meera |Gargeyi Yellapragada |Srinivasu Kakarla |S. Chinna

కథ ,స్క్రీన్ ప్లే, దర్శకుడు: శ్రీనివాసు కాకర్ల
ప్రొడ్యూసర్స్: డా: లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల
మ్యూజిక్: ఎస్ చిన్న
పొడక్షన్ డిజైనర్: తిరుమల ఎం తిరుపతి
మేకప్: పి రాంబాబు
అసోసియేట్ డైరెక్టర్: సూరి సాధనాల
ప్రొడక్షన్ మేనేజర్స్: కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై]
పాటలు: శ్రీ సాయి కిరణ్
సింగర్స్: సమీరా భరద్వాజ్ ,దీపక్ బ్లూ
సౌండ్ డిజైనర్: శరత్ [సౌండ్ పోస్ట్]
ఆడియోగ్రఫీ: ఎం గీత గురప్ప
పబ్లిసిటీ డిజైనర్: కృష్ణ డిజిటల్స్
మాటలు హిరణ్మయి కళ్యాణ్
ఎడిటర్: రాంబాబు మేడికొండ

Exit mobile version