Site icon A2Z ADDA

Puhspa Collection : దారుణంగా పడిపోయిన కలెక్షన్లు.. పుష్ప, శ్యామ్ సింగ రాయ్ పని ఖతం!

Shyam Singha Roy 12th Day Collection ప్రస్తుతం బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం పుష్ప, శ్యామ్ సింగ రాయ్ దుమ్ములేపేస్తోంది. అఖండ ఊపు కాస్త తగ్గిపోయింది. ఓమిక్రాన్, కరోనా అంటూ కేసులు పెరుగుతున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా నిబంధనలేమీ కూడా అమల్లోకి రాలేదు. పుష్ప 19వ రోజు, శ్యామ్ సింగ రాయ్ 12వ రోజు కలెక్షన్లు మాత్రం దారుణంగా డ్రాప్ అయ్యాయి.

పుష్పకు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయింది. లాభాల బాట పట్టింది. నైజాంలో నలభై కోట్ల మార్క్ దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచించింది. అలవైకుంఠపురములో, పుష్ప రెండు సినిమాలు కూడా నలభై కోట్ల మార్క్ దాటి బన్నీ స్టామినాను నిరూపించింది. ఇక ఓవర్సీస్‌లో అయితే రెండున్నర మిలియన్ల డాలర్లను ఎప్పుడో క్రాస్ చేసింది.

మూడు మిలియన్లకు పుష్ప పరుగులు పెడుతోంది. అయితే ఈ 19వ రోజు పుష్ప మాత్రం తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన కలెక్షన్లను రాబట్టింది. మొత్తంగా చూస్తే కేవలం నలభై లక్షలు మాత్రమే సొంతం చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇక హిందీ మార్కెట్‌లో మాత్రం పుష్ప ఇంకా దున్నేస్తోంది.

మరో వైపు శ్యామ్ సింగ రాయ్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజు దారుణమైన కలెక్షన్లను వసూల్ చేసింది. పన్నెండో రోజు దగ్గరదగ్గరగా పద్నాలుగు లక్షలు రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ పన్నెండు రోజుల్లో శ్యామ్ సింగ రాయ్ ప్రపంచ వ్యాప్తంగా 24.95 కోట్ల షేర్, 43. 66 కోట్ల గ్రాస్ రాబట్టేసి లాభాలా బాట పట్టేసింది. ఇక అదే సమయంలో పుష్ప అయితే 19 రోజుల్లో 159.44 కోట్ల షేర్.. 301.25 కోట్ల గ్రాస్ రాబట్టేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Exit mobile version