Site icon A2Z ADDA

Akhanda 1st Week Collection : ‘అఖండ’ హవా.. ఏ ఏరియాలో ఎంతెంత కొల్లగొట్టిందంటే?

అఖండ ఏడు రోజుల్లో మొత్తం వసూళ్లు తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సింది. బాలయ్య దెబ్బకు వారం రోజులుగా బాక్సాఫీస్ కళకళలాడుతూనే వచ్చింది. ఈ ఏడు రోజుల్లో అఖండ థియేటర్లలో దుమ్ములేపేసింది. అఖండ ఏడో రోజు కలెక్షన్లు కాస్త డ్రాప్ అయినా కూడా మొత్తంగా ఈ వారం రోజుల్లోని లెక్కలు చూస్తే మంచి ఫిగర్ వచ్చినట్టు అయింది. ఇక బ్రేక్ ఈవెన్‌కు అతి సమీపంలో బాలయ్య ఆగిపోయాడు.

ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వారిగా ఎంత కలెక్ట్ చేసిందంటే.. నైజాంలో 54 లక్షలు, సీడెడ్‌లో 35 లక్షలు, ఉత్తరాంధ్రలో 18 లక్షలు, ఈస్ట్ 8 లక్షలు, వెస్ట్ 7 లక్షలు, గుంటూరు 8 లక్షలు, కృష్ణ 8 లక్షలు, నెల్లూరు 6 లక్షలు కలెక్ట్ చేసింది. అలా మొత్తంగా ఏడో రోజు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 1.44 కోట్ల షేర్.. 2.40 కోట్ల గ్రాస్ రాబట్టింది.

మొత్తంగా ఈ ఏడు రోజుల్లో ఒక్క ఏరియాలో నుంచి ఎంత రాబట్టిందంటే.. నైజాంలో 14.87 కోట్లు, సీడెడ్‌లో 11.73, ఉత్తరాంధ్రలో 4.56, ఈస్ట్ 3.08, వెస్ట్ 2.43, గుంటూరు 3.73, కృష్ణ 2.73 లక్షలు, నెల్లూరు 1.98 కోట్లు కలెక్ట్ చేసింది. అలా మొత్తంగా ఏడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 45.11 కోట్ల షేర్.. 71.30 కోట్ల గ్రాస్ రాబట్టింది.

అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. ఓవర్సీస్‌లో 4.56 కోట్లు, రెస్టాప్ ఇండియాలో 3.82 కలుపుకుంటే.. మొత్తంగా 53.49 కోట్ల షేర్, 87.9 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తానికి బ్రేక్ ఈవెన్ మార్క్ అయిన 54 కోట్లను చేరుకునేందుకు ఇంకో 51 లక్షలు మాత్రమే కొల్లగొట్టాల్సి ఉంటుంది. అంటే రేపటితో అఖండ బ్రేక్ అయిపోతోంది. ఎనిమిదో రోజు నుంచి అఖండ లాభాలబాట పట్టనుందన్న మాట.

Exit mobile version