Site icon A2Z ADDA

Gamanam Collection : ఓవర్సీస్‌లో మరీ దారుణం.. మొదటి రోజే లక్ష్య, గమనం జెండా ఎత్తేశాయా?

Lakshya Day 1 Overseas Collection గమనం, లక్ష్యం సినిమాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇందులో గమనం సినిమా ప్రయోగాత్మకం లాంటిది. లక్ష్య కమర్షియల్ సినిమా. అందుకే కాస్త హైప్ క్రేజ్ ఎక్కువగా లక్ష్య మీద వచ్చింది. కానీ ఫలితం మాత్రం రెండింటికి ఒకేలా వచ్చింది. ఈ రెండు సినిమాలు వచ్చాయనే విషయం కూడా సాధారణ జనాలకు తెలియదు. వారు వీటిని పట్టించుకోవడం లేదు.

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. ఓవర్సీస్‌లోనూ గమనం గతి తప్పింది. లక్ష్య గురి మిస్ అయింది. ఈ రెండు చిత్రాలకు దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఓవర్సీస్‌లో ఈ రెండు చిత్రాలు మొదటి రోజు దారుణంగా బెడిసి కొట్టేశాయి. గమనం సినిమా అయితే మరీ దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. లక్ష్య కాస్త పర్వాలేదనిపించింది.

గమనం సినిమాకు మొదటి రోజు 493 డాలర్లు అంటే 37, 318 వేలు కలెక్ట్ చేసింది. ఇక లక్ష్య అయితే 3568 డాలర్లు అంటే 2.7 లక్షలు వసూళ్ చేసింది. అదే అఖండ తొమ్మిదో రోజు 5580 డాలర్లను కొల్లగొట్టింది. ఈ లెక్కలో సినిమాల ఫలితాన్ని చాటి చెబుతున్నాయి. అఖండ తొమ్మిదో రోజు కంటే లక్ష్య, గమనం ఓపెనింగ్స్ ఆమడ దూరంలో ఆగిపోయాయి. కొన్ని చోట్ల అయితే అఖండ లెక్కల్లో సగం కూడా లక్ష్యం సాధించలేకపోయింది.

అలా మొత్తానికి ఈ వారం కూడా అఖండకు ఎదురులేకుండా పోయింది. ఈ వారం కూడా అఖండ భారీ వసూళ్లను సాధించేట్టు కనిపిస్తోంది. అసలే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల పంట పండిస్తున్న అఖండకు పుష్ప సినిమా వచ్చే వరకు అడ్డేది నిలవదు.

Exit mobile version