Site icon A2Z ADDA

‘రాజా విక్రమార్క’డిజాస్టర్!.. ‘కురుప్’ లెక్కలు మామూలుగా లేవు

దుల్కర్ సల్మాన్‌కు తనకంటూ ఓ ప్రత్యేక మార్కెట్ ఉంది. మంచి నటుడిగా, ప్రయోగాలు చేసే యంగ్ హీరోగా దక్షిణాదిలో అతనికి మంచి క్రేజ్ ఉంది. ఇక మహానటి సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు. ఆ తరువాత అతను నటించిన చిత్రాలన్నీ కూడా తెలుగులోకి డబ్ అయ్యాయి. ఓకే బంగారం, కనులు కనులు దోచాయంటే సినిమాలు వచ్చాయి. హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే కురుప్ అనే సినిమాతో వచ్చాడు. ఆ సినిమా ఫలితం మోస్తరుగా వచ్చింది.

కేరళలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన కురుప్ కథతో ప్యాన్ ఇండియన్ లెవెల్‌లో దుల్కర్ సల్మాన్ వచ్చాడు. అయితే ఈ చిత్రాన్ని దాదాపు అన్ని భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. కానీ తెలుగులో ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఓవర్సీస్‌లో మాత్రం ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయట. తెలుగు సినిమాల కంటే ఎక్కువగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్య పరిచిందట. ప్రస్తుతం ఈ లెక్కలు చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయట.

ఈ వారంలో తెలుగు సినిమాలు పుష్పక విమానం, రాజా విక్రమార్క అంటూ విడుదలయ్యాయి. వీటికి ఓవర్సీస్‌లో అత్యంత దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. పుష్పక విమానం సినిమాకు శుక్ర, శని, ఆదివారాలు కలుపుకుని మొత్తంగా 78 వేల డాలర్లే వచ్చాయట. ఇక రాజా విక్రమార్క అయితే దారుణమైన స్థితిలో ఉందట. కనీసం 30 వేల డాలర్లను కూడా కొల్లగొట్టలేకపోయిందని తెలుస్తోంది.

కానీ కురుప్ మాత్రం దుమ్ములేపేసిందట. ఒక్క శుక్రవారం రోజే 91 వేల డాలర్లను వసూల్ చేసిందట. శనివారం అయితే ఏకంగా లక్ష డాలర్లకు పైగా వసూల్ చేసింది. ఆదివారం దాదాపు 75 వేల డాలర్లు కొల్లగొట్టిందట. మొత్తంగా చూసుకుంటే కురుప్ ఒక్క వీకెండ్‌లోనే 2 లక్షల డెబ్బై వేల డాలర్లను వసూల్ చేసింది. దీంతో అది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మన తెలుగు సినిమా యథావిథిగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

Exit mobile version