Site icon A2Z ADDA

Akhanda Overseas Collection : ‘అఖండ’ ఓవరాల్ ఓవర్సీస్ రిపోర్ట్.. ఇదీ బాలయ్య రేంజ్

Akhanda Day 9 worldwide Collection నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఓవర్సీస్‌లో అంతగా ఆడవు అని అందరూ అనుకునేవారు. ఎందుకంటే అక్కడ రొడ్డ కొట్టుడు, రొటీన్ ఫార్మూలా సినిమాలను చూడరు.. మాస్ మసాలా సినిమా కంటే.. కంటెంట్, కొత్త కథలను ఆదరిస్తారు అనే టాక్ ఉండేది. కానీ బాలయ్య అఖండ సినిమా మాత్రం ఓవర్సీస్‌లో అఖండమైన విజయం సాధించింది. తొమ్మిది రోజుల్లో తొమ్మిది లక్షల డాలర్లను కొల్లగొట్టేసింది.

అఖండ సినిమా ఓవర్సీస్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఓవర్సీస్‌లో అఖండ అమ్ముడు పోయిన రేటు, వచ్చిన కలెక్షన్లను చూసి అందరూ షాక్ అవుతున్నారు. మొత్తానికి అఖండ విడుదలైన అన్ని చోట్లా కూడా రికవరీ చేసేసింది. బ్రేక్ ఈవెన్ అయింది. అలా అఖండ ఎవర్సీస్‌లో రెండున్నర మూడు కోట్లలోపే అమ్ముడు పోతే.. వచ్చింది మాత్రం డబుల్ ధమాకా అన్నట్టు అయింది.

ఓవర్సీస్‌లో అఖండ ఏ ఏ రోజున ఎంతెంత కలెక్ట్ చేసిందో ఓసారి చూద్దాం. ప్రీమియర్స్ ద్వారా 3,32, 742 డాలర్లు, మొదటి రోజు 1,15,226 డాలర్లు, రెండో రోజు 1,28,509.. మూడో రోజు 1,55,545 డాలర్లు.. నాలుగో రోజు 84, 923 డాలర్లు.. ఐదో రోజు 21, 809 డాలర్లు.. ఆరో రోజు 28, 899 డాలర్లు, ఏడో రోజు 15,370 డాలర్లు, ఎనిమిదో రోజు 11, 758 డాలర్లు, ఇంకా తొమ్మిదో రోజు పూర్తి కాక ముందే 5, 580 డాలర్లను వసూల్ చేసింది.

అలా మొత్తంగా బాలయ్య అఖండ సినిమా తొమ్మిది రోజుల్లో తొమ్మిది లక్షల డాలర్లను రాబట్టింది. అంటే దాదాపు 6.81 కోట్లను కొల్లగొట్టేసింది. ఈ లెక్కన డబుల్ ప్రాఫిట్ వచ్చినట్టు అయింది. దీంతో ఓవర్సీస్‌లో అఖండ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే మిలియన్ మార్క్ ఫీట్‌ను బాలయ్య చేరుకుంటాడా? లేదా? అన్నది చూడాలి.

Exit mobile version