Site icon A2Z ADDA

నవంబర్ 1 నుంచి మోత మోగనుంది.. పెరిగిన ధరలు ఇవే

ప్రస్తుతం అన్ని వస్తువులు, ఉత్పత్తుల ధరలు పెరుగుతూనే పోతోన్నాయి. ఇక పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలకు అయితే రెక్కలొచ్చేశాయి. అవి ఆకాశాన్నంటుతున్నాయి. మామూలుగా అయితే ప్రతీ 15 రోజులకు ఒకసారి ఎల్పీజీ ధరలను సవరిస్తుంటారు. అలా ఇప్పుడు ఏకంగా గ్యాస్ బండ మీద వంద రూపాయాలు పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. మరో వైపు ఎస్బీఐ కొత్త రూల్‌ను పెట్టింది. వృద్దాప్యం వల్ల బ్యాంకుల రాలేని వారి కోసం వీడియో కాల్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. లైఫ్ సర్టిఫికేట్ కోసం బ్యాంకులకు రావాల్సిన అససరం లేదంది.

పాత ఫోన్లలో ఇకపై వాట్సర్ బంద్ కానుంది. ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9, కాయ్ 2.5.1 వర్షన్ ఓఎస్‌లతో పాటు వాటికి ముందు ఉన్న వర్షన్లకు కూడా వాట్సప్ పనిచేయదట. మొత్తానికి నవంబర్ 1 నుంచి భారీ మార్పులే రాబోతోన్నాయి.

FacebookWhatsAppTwitter
Exit mobile version